Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

వల వేస్తే ఫేస్‌ ‘బుక్‌’ అవ్వాల్సిందే.....


 వల వేస్తే ఫేస్‌ ‘బుక్‌’ అవ్వాల్సిందే.....రాజ్‌కుమార్‌ ఏ ప్రాంతానికి వెళ్లినా మాయ మాటలతో బురిడీ కొట్టించగలడతను. ఫేస్‌బుక్‌ వేదికగా అమ్మాయిలతో పరిచయం చేసుకుని మోసం చేశాడు. ఇతరి మోసాలకు ప్రొద్దుటూరు పోలీసులు చెక్‌ పెట్టడంతో కటకటాల పాలయ్యాడు. కర్నూలు జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాలకు చెందిన అవుజ రాజ్‌కుమార్‌ను రూరల్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ సుధాకర్‌ నిందితున్ని మీడియా ఎదుట హాజరు పరచి వివరాలు వెల్లడించారు. రాజ్‌కుమార్‌ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు పెట్టుకుని ప్రైవేట్‌ ఉపాధ్యాయుడుగా, ఆర్‌ఎంపీగా చలామణి అవుతున్నాడు. యువతులను అకర్షించేందుకు విగ్గు పెట్టుకునేవాడు.లో ఆ ప్రాంత అమ్మాయిలను పసిగడతాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తాడు.


రిక్వెస్టు ఆమోదించిన తర్వాత వారిని ఆకట్టుకునేలా మెసేజ్‌లను పంపిస్తాడు. వారి నుంచి ఫొటోలు తెప్పించుకోవడం, కలిసి ఫొటోలు దిగడం చేసేవాడు.కొన్ని రోజుల తర్వాత యువతుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తూ లైంగికంగా లొంగ తీసుకునేవాడు. బంగారు, నగదు తీసుకొని ఎక్కడైనా చెబితే చంపేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. రాజ్‌కుమార్‌ కొన్ని నెలల క్రితం రాజుపాళెం మండలంలోని గ్రామంలో ప్రైవేట్‌ పాఠశాలను లీజ్‌కు తీసుకున్నాడు. అక్కడి యువతులతో మంచిగా ఉంటూ బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో మార్చి 18న ఒక యువతిని ప్రొద్దుటూరుకు పిలుపించుకున్నాడు. అక్కడికి రాగానే మత్తు మందు చల్లి కారులో నెల్లూరు జిల్లాకు తీసుకొని వెళ్లాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల తర్వాత నెల్లూరు నుంచి చిలకలూరిపేటకు తీసుకెళ్లి ఒక ఇంట్లో బంధించాడు. అతను ఇంట్లో లేని సమయంలో ఆమె చాకచక్యంగా తప్పించుకొని వచ్చింది. తర్వాత పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ద్వారా పోలీసులు వివరాలు సేకరించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాజ్‌కుమార్‌ రాజుపాళెం మండంలోని వెల్లాల వద్ద ఉన్నాడని తెలియడంతో సీఐ విశ్వనాథ్‌రెడ్డి, రాజుపాళెం ఎస్‌ఐ లక్ష్మినారాయణ సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్‌ చేశారు. అతను ఉపయోగిస్తున్న కారును సీజ్‌ చేశారు.
ఈ కేసులో మంచి సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభ కనబరచిన సీఐ, ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్లు నాగ, సుబ్రమణ్యం, ఉదయ్‌కుమార్‌ను డీఎస్పీ అభినందించారు. కోవిడ్‌ పరీక్షల అనంతరం నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు.రాజ్‌కుమార్‌ ఏ ప్రాంతానికి వెళ్లినా ఫేస్‌బుక్‌లో ఆ ప్రాంత అమ్మాయిలను పసిగడతాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తాడు. రిక్వెస్టు ఆమోదించిన తర్వాత వారిని ఆకట్టుకునేలా మెసేజ్‌లను పంపిస్తాడు. వారి నుంచి ఫొటోలు తెప్పించుకోవడం, కలిసి ఫొటోలు దిగడం చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత యువతుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తూ లైంగికంగా లొంగ తీసుకునేవాడు. బంగారు, నగదు తీసుకొని ఎక్కడైనా చెబితే చంపేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. రాజ్‌కుమార్‌ కొన్ని నెలల క్రితం రాజుపాళెం మండలంలోని గ్రామంలో ప్రైవేట్‌ పాఠశాలను లీజ్‌కు తీసుకున్నాడు. అక్కడి యువతులతో మంచిగా ఉంటూ బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో మార్చి 18న ఒక యువతిని ప్రొద్దుటూరుకు పిలుపించుకున్నాడు. అక్కడికి రాగానే మత్తు మందు చల్లి కారులో నెల్లూరు జిల్లాకు తీసుకొని వెళ్లాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల తర్వాత నెల్లూరు నుంచి చిలకలూరిపేటకు తీసుకెళ్లి ఒక ఇంట్లో బంధించాడు. అతను ఇంట్లో లేని సమయంలో ఆమె చాకచక్యంగా తప్పించుకొని వచ్చింది. తర్వాత పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ద్వారా పోలీసులు వివరాలు సేకరించారు.
నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాజ్‌కుమార్‌ రాజుపాళెం మండంలోని వెల్లాల వద్ద ఉన్నాడని తెలియడంతో సీఐ విశ్వనాథ్‌రెడ్డి, రాజుపాళెం ఎస్‌ఐ లక్ష్మినారాయణ సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్‌ చేశారు. అతను ఉపయోగిస్తున్న కారును సీజ్‌ చేశారు. ఈ కేసులో మంచి సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభ కనబరచిన సీఐ, ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్లు నాగ, సుబ్రమణ్యం, ఉదయ్‌కుమార్‌ను డీఎస్పీ అభినందించారు. కోవిడ్‌ పరీక్షల అనంతరం నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు.మన రాష్ట్రంలోని యువతులే కాకుండా పొరుగు రాష్ట్రంలోని కొందరు కూడా రాజ్‌కుమార్‌ చేతిలో మోసపోయారు. హైదరాబాద్, బెంగళూరుతోపాటు ఏపీలోని కర్నూలు, నంద్యాల, పత్తికొండ, నెల్లూరు జిల్లా కావలి, దేవనకొండలో అమ్మాయిలను మోసగించిన సంఘటనల్లో 10 కేసులు నమోదయ్యాయి. ఈ తరహా కేసుల్లో అతను జైలు జీవితం గడిపినా అతని నేరప్రవృత్తిని వీడలేదు. బెయిల్‌పై జైలు నుంచి బయటికి రాగానే మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు. అతని చేతిలో పలువురు అమ్మాయిలు మోసపోయినట్లు సమాచారం. పోలీసులు విచారణ చేస్తే.. మరికొన్ని నేరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments