Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

Grandma cooking while brain surgery is underway......

బ్రెయిన్‌ సర్జరీ జరుగుతుండగా వంట చేసిన బామ్మ........ఓ వైపు వైద్యులు బ్రెయిన్‌ సర్జరీ చేస్తుంటే.. మరో వైపు రోగి ఎంచక్కా పాటలు పాడటమో.. ఏదైనా వాయిద్యాన్ని వాయించటం లాంటి ఘటనలు కోకొల్లలు. కానీ, ఈ వార్త అందుకు భిన్నమైనది. ఓ బామ్మ మాత్రం తనకు బ్రెయిన్‌ సర్జరీ జరుగుతుండగానే మంట లేకుండా వంట చేసేసింది. ఈ సంఘటన ఇటలీలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం అన్‌కోనా సిటీలోని రీయూనిటీ హాస్పిటల్‌లో ఓ 60ఏళ్ల బామ్మకు బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. అమె టెంపరల్‌ లోబ్‌( మాట, కుడివైపు భాగం కదలికలను కంట్రోల్‌ చేసే మెదడులోని భాగం) పని తీరును గమనించేందుకు ఆమెను ఏదైనా పని చేస్తుండమని పురమాయించారు వైద్యులు.
దీంతో ఆమె వంట చేయటానికి సిద్ధపడింది. ఓ వైపు వైద్యులు సర్జరీ చేస్తుంటే మరో వైపు ఆమె 90 స్టఫ్‌డ్‌ ఆలీవ్స్‌ను తయారు చేసింది. ప్రస్తుతం బామ్మ బ్రెయిన్‌ సర్జరీకి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ గ్రేట్‌ చెఫ్‌.. ఆమె ఓ వంటల మహారాణి.. ఏదో హర్రర్‌ సినిమా చూసినట్లుగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Post a Comment

0 Comments